- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
by Yella Dhawani Reddy |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల (Tirumala) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల (Tirumala) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం కావటంతో ఇవాళ తెల్లవారుజాము నుంచే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు (Devotees) పోటెత్తడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండి, బయట ఎన్‌జీ షెడ్స్ వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో సర్వదర్శనానికి 20 గంటలు పడుతోండగా, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్టు తీసుకున్న భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని భక్తులు గమనించాలని పిలుపునిచ్చారు. ఇక నిన్న అర్థరాత్రి వరకు శ్రీవారిని 68,229 మంది భక్తులు దర్శించుకోగా, 30,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు సమకూరినట్లు TTD అధికారులు తెలిపారు.
Next Story






