Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి సుప్రభాత సేవ రద్దు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-15 05:39:29  IST  )

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) కీలక ప్రకటన చేసింది.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి సుప్రభాత సేవ రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు 17 నుంచి సుప్రభాత సేవ (Suprabhath Seva)ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ధనుర్మాసం (Dhanurmasam) సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టీటీడీ అధికారులు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 1:23 గంటలకు ధనుర్మాస ఘడియలు అధికారికంగా ప్రారంభం కానుండడంతో డిసెంబర్ 17 ఉదయం నుంచి జనవరి 14 వరకు సాధారణ సుప్రభాత సేవ స్థానంలో గోదాదేవి రచించిన తిరుప్పావై 30 పాశురాలతో శ్రీవారిని మేల్కొలుపుతారు. ఈ సంప్రదాయం వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాసంలో ఆనవాయితీగా కొనసాగుతుంది.

కాగా, ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి బిల్వ పత్రాలతో సహస్త్ర నామార్చన నిర్వహించనున్నారు. ప్రతిరోజూ శ్రీవిల్లి పుత్తూరు చిలుకలతో స్వామి వారికి అలంకరణ చేయనున్నారు. ఇక సాధారణ దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు ఎప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని టీటీడీ తెలిపింది. భక్తులు తిరుమలకు వెళ్లే ముందు అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో స్లాట్ అందుబాటును తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది. ధనుర్మాసంలో విశేష కైంకర్యాలతో శ్రీవారికి మరింత శోభ రానుంది.

Next Story