Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 18 కంపార్ట్‌మెంట్లు ఫుల్

by Kema Shiva Kumar |

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 18 కంపార్ట్‌మెంట్లు ఫుల్
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వీకెండ్ ముగిసినప్పటికీ, శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntham Queue Complex)లో భక్తుల తాకిడి నెలకొంది. టోకెన్లు లేని భక్తులు 18 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 12 గంటల సమయం, టైమ్ స్లాట్ (SSD) టోకెన్లు పొందిన భక్తులకు దర్శనం కోసం 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతోంది.

ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 81,894 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,754 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story