- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా? ఇదే మంచి సమయం సుమా..
తిరుమలకు వెళ్లాలని ప్లాన్ చేసుకునే భక్తులకు ఇదే మంచి సమయం. ఈ సమయంలో భక్తుల రద్దీ దాదాపు సాధారణంగా ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలకు వెళ్లాలనుకునేవారికి ఇదే సమయం. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ స్టార్ట్ అయ్యాయి. టెన్త్ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవుతుండటంతో.. తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. దీంతో స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. సర్వదర్శనం టోకెన్లు లేకున్నా 5-6 గంటల్లో స్వామివారి దర్శనం అవుతోంది. ప్రస్తుతం (బుధవారం) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి ఉచిత దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు 6 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 2-3 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 1-2 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (మంగళవారం) స్వామివారిని 69,389 మంది భక్తులు దర్శించుకోగా.. 20,247 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.






