- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Spirituality: పెళ్ళైన కూతురికి, పుట్టింటి వారు పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకూడదు.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే ..?
వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం కొన్నింటిని దానం చేయడం వల్ల సంబంధాలు తెగిపోవడం

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి తర్వాత కూతురికి పుట్టింటివారు గిఫ్ట్ లు ఇవ్వడం ఆచారం. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. కానీ, మనం బహుమతులుగా ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు అలోచించి ఇవ్వాలి. అలాగే, పెళ్లైన కూతురికి ఏదైనా వస్తువులు పంపించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం కొన్నింటిని దానం చేయడం వల్ల సంబంధాలు తెగిపోవడం, డబ్బుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి, వీటిపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూతురికి గిఫ్ట్ లు ఇచ్చేటప్పుడు ఈ మూడింటిని అస్సలు ఇవ్వకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
గాజు వస్తువులు ( Glass )
జ్యోతిష్యం ప్రకారం వివాహం చేసుకున్న కుమార్తెకు గాజుకి సంబంధించిన వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వడం వలన అత్తింటిలో ఆర్థిక సమస్యలు వస్తాయి. గాజును అస్థిరతకు చిహ్నంగా చెబుతుంటారు. జీవితంలో స్థిరత్వం లోపించవచ్చని ఇది సూచిస్తుంది. అలాగే, గాజు సామాను కింద పడితే ముక్కలు ముక్కలుగా అవుతుంది. ఇది రెండు కుటుంబాల సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఊరగాయ ( uragaya pickle)
ఊరగాయ పుల్లగా, ఉప్పగా ఉంటుంది. ఇది సంబంధంలో పుల్లని రుచికి చిహ్నంగా భావిస్తారు. మీ కూతురికి ఊరగాయలు ఇవ్వడం వలన అత్తమామలతో వివాదాలు కూడా వస్తాయి. వాటికీ బదులుగా, స్వీట్లు , పంచదార వంటి తియ్యటి వాటిని ఇవ్వడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది, మీ సంబంధాలను మరింత బలపడేలా చేస్తుంది.
నల్ల బట్టలు ( black )
జ్యోతిష్యం ప్రకారం నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. పెళ్లైన తర్వాత మీ కూతురికి నల్లటి దుస్తులు గిఫ్ట్ గా అందించడం వలన ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని అంటున్నారు. ఫలితంగా, భార్యాభర్తల మధ్య దూరం పెరిగి విడిపోయే అవకాశం కూడా ఉంది. వాటికీ బదులు పింక్ , పచ్చ రంగులలో ఉన్న దుస్తులను ఇవ్వడం చాలా మంచిది. దీని వలన ఆమె జీవితంలో సంతోషం పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






