- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియా ప్రభుత్వం హజ్ - 2026 (1447 హిజ్రీ) యాత్రకు కొన్ని కఠిన నియమాలు తీసుకొచ్చింది. హజ్ యాత్ర శారీరకంగా చాలా కష్టమైనది కావడంతో, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా డయాలసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, తీవ్రమైన గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, లివర్ ఫెయిల్యూర్ లేదా తీవ్రమైన సిర్రోసిస్, డిమెన్షియా, మెమరీ లాస్ వంటి సమస్యలు ఉన్నవారు హజ్‌కు అర్హులు కాదని తెలిపింది. వీటితో పాటు 28 వారాలు నిండిన గర్భిణీలు, ఆరోగ్య సమస్యలు ఉన్న గర్భిణీ స్త్రీలు, క్యాన్సర్ పేషెంట్లు, టీబీ వంటి వ్యాధులు ఉన్నవారికి కూడా అనుమతి లేదని పేర్కొంది.
ఆరోగ్యానికి అనర్హులని తేలితే ఎంట్రీ పాయింట్లలోనే వారిని వెనక్కి పంపిస్తారని, దానికి అయ్యే ఖర్చు కూడా యాత్రికులే భరించాల్సి ఉంటుందని సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పుగా ఇచ్చిన డాక్టర్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అలాగే మొదటిసారి హజ్‌కు వెళ్లే వారికి ప్రాధాన్యత ఇస్తూ, ఇప్పటికే హజ్ చేసినవారిపై కొన్ని పరిమితులు విధించింది. హజ్ సమయంలో జరిగే ప్రమాదాలను తగ్గించడానికి, యాత్రికుల ప్రాణాలను కాపాడడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు సౌదీ అధికారులు పేర్కొన్నారు.






