తిరువణ్ణామలైలో దర్శనమిచ్చిన మహా దీపం.. గురువారం కూడా కొనసాగుతున్న భక్తుల రద్దీ

by Malleboina Mahesh |

గత సంవత్సర కాలంగా తమిళనాడులోని తిరువణ్ణామలైకి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి శివ భక్తులు అరుణచలంకు వెళ్తుండటంతో అక్కడ నిత్యం భక్తుల రద్ధీ కనిపిస్తుంది.

తిరువణ్ణామలైలో దర్శనమిచ్చిన మహా దీపం.. గురువారం కూడా కొనసాగుతున్న భక్తుల రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్: గత సంవత్సర కాలంగా తమిళనాడులోని తిరువణ్ణామలైకి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి శివ భక్తులు అరుణచలం (Arunachalam)కు వెళ్తుండటంతో అక్కడ నిత్యం భక్తుల రద్ధీ కనిపిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి సమయాల్లో ఈ రద్దీ విపరీతంగా మారుతున్న విషయం తెలిసిందే. గత కార్తీక మాసంలోను తిరువణ్ణామలైలో నిత్యం భక్తుల రద్దీ కొనసాగింది. ఇదిలా ఉంటే బుధవారం కార్తీక దీపం పండుగలో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన మహా దీపం అన్నామలై కొండపై వెలిగింది. ఈ మహా దీపాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం మహా దీపం దర్శనమివ్వగా.. నేటికి తిరువణ్ణామలై దివ్య శక్తితో మారుమోగుతూనే ఉంది.

సాంప్రదాయ పద్ధతులలో వెలిగించిన ఈ పవిత్ర దీపం, శివుడి శాశ్వత కాంతిని, ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈరోజు ఉదయం తిరువణ్ణామలైలో వాతావరణం ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంది. అరుణాచలేశ్వర ఆలయం, అన్నామలై కొండల నుండి వచ్చిన దృశ్యాలలో భక్తుల రద్దీ తగ్గినట్లు కనిపించింది. కొంతమంది భక్తులు మాత్రమే గిరి ప్రదక్షిణలు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎక్కువ మంది యాత్రికులు నిన్న రాత్రి మహా దీపం వేడుకల్లో పాల్గొన్న తర్వాత తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం ప్రారంభించారు.

Next Story