- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. ఆక్టోపస్ భవనం వరకూ క్యూలైన్
వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. రథసప్తమి నేపథ్యంలో టీటీడీ ఈనెల 24,25,26 తేదీల్లో భక్తులకు సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. రథసప్తమి నేపథ్యంలో టీటీడీ ఈనెల 24,25,26 తేదీల్లో భక్తులకు సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసింది. దీంతో సోమవారం ఉదయం అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి ఆక్టోపస్ భవనం వరకూ క్యూలైన్ ఉంది. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నవారికి శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం, కొత్తగా క్యూలైన్లోకి వెళ్లేవారికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (ఆదివారం) స్వామివారిని 84,104 మంది దర్శించుకోగా.. 35,131 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా.. నిన్న తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సుమారు 3 లక్షల మంది భక్తులు రథసప్తమి వేడుకలను వీక్షించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.






