తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం!

by Kema Shiva Kumar |

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం!
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం స్వామి వారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 10 సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 4 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అలిపిరి టోల్‌గేట్ నుంచి ప్రారంభమయిన రద్దీ తిరుమల ఘాట్ రోడ్డులో కూడా కొనసాగుతుందని, వర్షాలు పడుతున్న నేపథ్యంలో నిదానంగా భక్తులు స్వామి వారి సన్నిథికి చేరుకోవాలని సూచించారు.

Next Story