- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రావణ మాసం వచ్చింది.. ముహూర్తాలు తెచ్చింది
ఆషాఢ మాసం కావటంతో గత నెల రోజులుగా పెళ్లిళ్లకి, శుభాకార్యాలకి ముహుర్తాలు లేవు.

దిశ, వెబ్ డెస్క్: ఆషాఢ మాసం కావటంతో గత నెల రోజులుగా పెళ్లిళ్లకి, శుభాకార్యాలకి ముహుర్తాలు లేవు. ఇక ఈరోజుతో ఆషాఢం ముగిసి శ్రావణ మాసం వచ్చేసింది. హిందువులు ఈ శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రంగా కొలుస్తారు. అంతేకాదు, తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు, శుభకార్యాలు, పండుగలు చేసుకుంటారు. జులై 25 నుంచి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. ఇక ఈ మాసం ముగిసే వరకు శుభకార్యాలకు ముహూర్తాలే ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలతో తెలుగు రాష్ట్రాలు సందడిగా మారనున్నాయి. ఈ ఏడాదిలో మే నుంచి మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు చేసుకునేవారు.. ఇతర శుభకార్యాలు తలపెట్టాలనుకునే వారు శ్రావణ మాసం కోసం వేచి చూస్తున్నారు.
అంతేకాదు, ఈ నెలలో పెళ్లిళ్లు చేసుకుంటే మంచి జరుగుతుందని.. ఆ లక్ష్మీదేవి, హరిహరుల కరుణ కటాక్షం కొత్తదంపతులకు ఉంటుందని పండితులు చెబుతుంటారు. అందుకే చాలా జంటలు శ్రావణ మాసంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇక ఈ మాసంలో 17 మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. తరువాత భాద్రపదం రానుంది. సెప్టెంబరు 21 వరకు ఇది శూన్యమాసం కావడంతో శుభ ముహుర్తాలు లేకపోవటంతో నెల రోజుల పాటు వేడుకలకు బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇక శ్రావణ మాసం రావడంతో ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్న వారు ఫంక్షన్ హాల్స్‌ను బుక్ చేసుకునే పనిలో పడ్డారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి మెట్రో సిటీలలో ముహూర్తాలున్న రోజుల్లో ఇప్పటికే బుకింగ్స్ పూర్తి అయిందని తెలుస్తోంది.
శుభ ముహుర్తాలు ఉన్న రోజులివే:
జులై : 26, 30, 31
ఆగస్టు : 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 21
సెప్టెంబర్ : 23, 24, 26, 27, 28
అక్టోబర్ : 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31
నవంబర్ : 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30






