తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ

by Yella Dhawani Reddy |

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి కొండపై భక్తుల రద్దీ తగ్గింది.

తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్:ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి కొండపై భక్తుల రద్దీ తగ్గింది. గత కొన్ని రోజులు భారీగా రద్దీ నెలకొనగా.. వారం రోజులగా వర్షాలు పడుతుండటంతో రద్దీ తగ్గినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా వేసవి సెలవుల్లో, ముఖ్యంగా మే నెలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి జూలై మొదటి వారం నుంచే తిరుమలలో భారీ రద్దీ నెలకొంది. దీంతో క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, శనివారం కొండపై భక్తుల రద్దీ తగ్గటంతో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అలాగే, వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక నిన్న (శుక్రవారం) అర్థరాత్రి వరకు శ్రీవారిని 73,576 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,227 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.23 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story