- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో రద్దీ సాధారణం.. 11 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్న భక్తులు
కలియుగ వైకుంఠమైన తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠమైన తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Queue Complex)లోని 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. దర్శన టికెట్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (SSD) సుమారు 8 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికే దర్శనం చేసుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో తిరుమల శ్రీవారిని మొత్తం 69,262 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 22,728 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామి వారి హుండీ ద్వారా రూ.3.77 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.






