ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది వరకూ పూజలు చేయకూడదంటారు ఎందుకు?

by Naga Rani Yarlagadda |

ఇంట్లో ఏదైనా విషాద ఘటన, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే.. ఆ ఇంట్లో పూజలు చేయకూడదు. పండగలు జరుపుకోవద్దు అనే నమ్మకం ఉంది.

ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది వరకూ పూజలు చేయకూడదంటారు ఎందుకు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఏదైనా విషాద ఘటన, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే.. ఆ ఇంట్లో పూజలు చేయకూడదు. పండగలు జరుపుకోవద్దు అనే నమ్మకం ఉంది. కొన్ని కుటుంబాల్లో అయితే దేవుడి గదిని పూర్తిగా మూసివేసి, దీపారాధన చేయకుండా సంవత్సరం పాటు అలానే ఉంచుతారు. కానీ ఈ సంప్రదాయం వెనుక నిజంగా ఏమైనా శాస్త్రీయ కారణముందా? లేక ఇవి కేవలం ప్రజల నమ్మకాలేనా?

పురాణాల ప్రకారం..

పురాణాలు, ధర్మశాస్త్రాల్లో స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే – మనిషి మరణించిన తర్వాత తొలి 10 రోజుల వరకూ ఇంట్లో పూజలు చేయకూడదు. దీనికి శౌచము (శుద్ధి కాలం) అనే మతపరమైన కారణం ఉంది. కానీ 11వ రోజు నుంచి మళ్లీ సాధారణంగా పూజలు, దీపారాధనలు ప్రారంభించవచ్చు.

దేవుడి గది మూసేయాలా?

అందులోనూ దీపారాధన అనేది త్యాజ్యం కాదు. “దీపం లేకపోయిన ఇల్లు స్మశానంతో సమానం” అనే నానుడి మన సంస్కృతిలో ఉంది. సంవత్సరం పాటు దీపారాధన లేకుండా ఇంటిని ఉంచడం శుభదాయకం కాదు. ఇది శాస్త్రపరంగా అరిష్టకరమైనదిగా పరిగణించబడుతుంది.

పండగలు చేయకూడదా?

పండగలు జరుపుకోవడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. కొన్ని కుటుంబాల్లో పండగలు పాడుగా జరుగుతాయని భావించి దూరంగా ఉంటారు. కానీ శాస్త్ర పరంగా పండగను జరుపుకోవద్దు అని స్పష్టమైన నిషేధం లేదు. మరణం జరిగిన ఆ బాధ నుంచి బయట పడేందుకు కూడా పూజలు, పండగలు మనసుకు ఓ శాంతిని ఇస్తాయి.

మనిషి చనిపోయిన తరువాత 10 రోజులు పూజలు చేయకపోవడం శాస్త్రం. కానీ, ఏడాది పాటు దేవుడిని దూరంగా ఉంచడం అనవసరం. దీపారాధనతో పాటు సాధారణ పూజాచర్యలు కొనసాగించడం శుభప్రదం.

Next Story