భర్తలకు షాకింగ్ న్యూస్.. మీ భార్యలు చేసే పాపాల గురించి సనాతన ధర్మం ఏం చెబుతుందో తెలుసా?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-07 07:56:02  IST  )

ప్రపంచంలో ఉన్న అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం గొప్పదని చెబుతారు.

భర్తలకు షాకింగ్ న్యూస్.. మీ భార్యలు చేసే పాపాల గురించి సనాతన ధర్మం ఏం చెబుతుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో ఉన్న అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం గొప్పదని చెబుతారు. వివాహా బంధంతో ఒక్కటైన వారిద్దరూ జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా కష్టాసుఖాలను పంచుకుంటారు. అయితే, కాలంతో పాటు భార్యాభర్తల బంధంలో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధం అంటే తిట్టుకోవటం, కొట్టుకోవటం అన్నట్లు మారిపోయింది. ఈ క్రమంలో అసలు భార్యాభర్తల బంధం గురించి సనాతన ధర్మం ఏం చెబుతుంది? భార్యాభర్తల పాప పుణ్యాల్లో ఎవరికి ఎంత ఫలితం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ ధర్మ శాస్త్రంలో భార్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. సాంప్రదాయంగా భార్యను భర్తకు 'అర్ధాంగి' అని పిలుస్తారు. పెళ్లయిన తర్వాత భర్తకు కుటుంబ బాధ్యతలలో భార్య భాగస్వామి అవుతూ అతడికి అన్ని విధాలా సహాయపడుతుంది. ఇక భార్యాభర్తలు ఎప్పుడు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. భర్త స్వభావం, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఏం మాట్లాడుతాడు? అనే విషయాలపై భార్యకు పూర్తి అవగాహన ఉండాలి. అలాగే, భార్య ఇష్టాయిస్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య, భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడు ప్రవర్తించకూడదు. ఇద్దరి మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకోవాలి.

మహాభారతంలో భీష్మ పితామహుడు సైతం భార్య గురించి గొప్ప విషయాలు చెప్పారు. భార్యను గృహలక్ష్మిగా భావించాలని, ఆమె వల్లే కుటుంబ వృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇంట్లో శాంతి, సుభిక్షత, ఆనందం పెరగాలంటే భార్యను గౌరవించాలి, సంతోషంగా ఉంచాలన్నారు. ఇక భార్యాభర్తల పాప పుణ్యాల విషయానికి వస్తే.. భర్త తన జీవిత కాలంలో చేసిన ప్రతి ధర్మ కార్యంలో, ప్రతి పుణ్యంలో సగ భాగం భార్యకు చెందుతుంది. అందుకే భర్త ఏదైనా ధర్మ కార్యాలు చేసేప్పుడు భార్యకు కచ్చితంగా తెలియజేయాలని అంటారు పెద్దలు. ఇక భర్త చేసే పాప కార్యాల్లో మాత్రం భార్యకు ఎలాంటి భాగం వెళ్లదు. అలాగే, భార్య తన జీవిత కాలంలో ఎన్ని పూజలూ, పుణ్యకార్యాలూ చేసినా సరే ఆ ప్రతిఫలంలో ఒక్క శాతం కూడా భర్తకు చెందదు. కానీ, భార్య చేసే పాపల్లో సగ భాగం మాత్రం భర్తకు చెందుతుందని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అందుకే భార్య కూడా ఏదైనా కార్యం చేసేటప్పుడు దాని మంచిచెడుల గురించి భర్తతో చర్చించాలని చెబుతుంటారు.

భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే శాస్త్రంలో చెప్పినట్లుగా కొన్ని నియమాలు పాటించాలి. ఏ బంధంలో అయిన కోపతాపాలు అనేవి సర్వసాధారణం. చిన్న చిన్న విషయాలకే బంధాన్ని తెచ్చుకోకుండా కూర్చొని ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకుంటే ఆ బంధం కలకాలం సంతోషంగా ఉంటుంది.

Next Story