2026లో శని అస్తమయం.. ఈ మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే

by Naga Rani Yarlagadda |

వేద జ్యోతిషశాస్త్రంలో శనిని క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు.

2026లో శని అస్తమయం.. ఈ మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే
X

దిశ, వెబ్‌డెస్క్: వేద జ్యోతిషశాస్త్రంలో శనిని క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. శని ఏ రాశిలోనైనా నీఛ స్థితిలో ఉంటే వారికి ఎక్కడలేని కష్టాలన్నీ వస్తాయి. ఏలినాటి శని జాతకంలో ఉంటే.. ఏ పని చేపట్టాలన్నా అడ్డంకులే. ఒక్క ప్రయత్నంలో పనులేవీ పూర్తికావు. 2026లో శని 41 రోజులపాటు అస్తమించి.. మళ్లీ ఉదయించనున్నాడు. 2026 మార్చి 13 నుంచి ఏప్రిల్ 21 వరకూ శని అస్తమించనున్నాడు. శని అస్తమయం, ఉషోదయంతో కొన్ని రాశులవారికి ప్రయోజనం చేకూరనుంది.

వృషభరాశి

ఈ రాశివారికి శని అస్తమయం, ఉషోదయ కాలం చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. వ్యాపారాల్లో గణనీయంగా లాభాలు పొందుతారు. వ్యూహాత్మక పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో ఖ్యాతి, గౌరవం పెరుగుతాయి. ఇతరులతో వీరి సంబంధం మరింత స్నేహపూర్వకంగా ఉంటుంది. కుటుంబంలోనూ స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది.

మిథునరాశి

మిథున రాశి వారికి కూడా శని అస్తమయం, ఉదయం చాలా శుభప్రదంగా ఉండనుంది. వ్యాపార, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి చాలా మంచిది. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి. వివాహ సంబంధిత ప్రణాళికలకు అనుకూలం.

మకర రాశి

ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గే ఛాన్స్ ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది.వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

Next Story