- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరుణాచలం వెళ్లే భక్తులకు సామవేదం షణ్ముఖశర్మ కీలక విజ్ఞప్తి
ఈ మధ్యకాలంలో అగ్నిలింగ (Agni Lingam) క్షేత్రమైన అరుణాచలం (Arunachalam)కు భక్తుల తాకిడి పెరిగింది. ప్రవచన కర్తలు చెప్తున్న మాటల వల్లనో, శివయ్యపై భక్తి పెరగడం వల్లనో కానీ.. గతంలో ఎన్నడూ లేనంతమంది భక్తులు అరుణాచలంకు పోటెత్తుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో అగ్నిలింగ (Agni Lingam) క్షేత్రమైన అరుణాచలం (Arunachalam)కు భక్తుల తాకిడి పెరిగింది. ప్రవచన కర్తలు చెప్తున్న మాటల వల్లనో, శివయ్యపై భక్తి పెరగడం వల్లనో కానీ.. గతంలో ఎన్నడూ లేనంతమంది భక్తులు అరుణాచలంకు పోటెత్తుతున్నారు. ఇక పౌర్ణమి తిథి, వారాంతాల్లో అయితే రద్దీ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతినెలా పౌర్ణమి రోజున అయితే లక్షల్లో భక్తులు తరలి వెళ్తుండటంతో అక్కడ బస చేసేందుకు హోటల్ రూమ్ లు కూడా దొరకని పరిస్థితి. అయితే అరుణాచలంకు పెరుగుతున్న భక్తుల తాకిడిని చూసి ప్రముఖ ప్రవచన కర్త సామవేదం షణ్ముఖ శర్మ (Samavedam Shanmukha Sharma) కీలక విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలంకు భక్తుల తాకిడి పెరగడం మంచి విషయమేనన్నారు. కానీ.. గిరి ప్రదక్షిణ చేస్తూ.. దారి పొడుగునా ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను పడేయడం మంచి పద్ధతి కాదని, ఇలా చేస్తే ఆ శివయ్యకు నచ్చదని చెప్పారు. అలాగే గిరి ప్రదక్షిణలో నీరసం రాకుండా ఏ పండో ఫలమో తినొచ్చు కానీ.. ఏదో విహారయాత్రకు వెళ్లినట్లుగా కనిపించిన తినుబండారాలన్నింటినీ తినడం కూడా మంచిది కాదన్నారు. శైవభక్తితో ప్రదక్షిణ చేస్తేనే దాని ఫలితం దక్కుతుందని తెలిపారు. ఇక పవిత్ర క్షేత్రాల్లో ఎక్కడపడితే అక్కడ మల, మూత్ర విసర్జనలు చేయకూడదన్నారు. అలా చేయడం చాలా అపచారమన్నారు. అరుణాచలం వెళ్లే భక్తులు.. ఆ అరుణాచలేశ్వరుని నామం పఠిస్తూ, శుచి శుభ్రత పాటిస్తూ గిరి ప్రదక్షిణ చేయాలని సూచించారు.
అరుణాచలం వెళ్ళే వారికి, వెళ్ళాలనుకొనే వారికి తప్పక ఈ వీడియో చూపించండి..






