కొత్త సంవత్సరంలో సూర్య-శని గ్రహాల కలయిక.. ఈ మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే

by Naga Rani Yarlagadda |

కొత్త సంవత్సరంలో సూర్య- శని గ్రహాలు కలవనున్నట్లు జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.

కొత్త సంవత్సరంలో సూర్య-శని గ్రహాల కలయిక.. ఈ మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరంలో సూర్య- శని గ్రహాలు కలవనున్నట్లు జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. వేదజ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్య - శనిదేవులు తండ్రి కొడుకులు. సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజుగా, శనిదేవుడిని అన్ని గ్రహాలకు న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు సంచరించినా, కలిసినా.. వాటి ప్రభావం మనుషుల జీవితంపై ఉంటుందని నమ్మకం. నూతన సంవత్సరంలో వీరిద్దరి కలయిక పంచాంక యోగాన్ని ఏర్పరుస్తోంది. ప్రస్తుతం సూర్యుడు ధనస్సు రాశిలో, శని మీన రాశిలో సంచరిస్తున్నారు. ఈ రెండు రాశులు బృహస్పతికి చెందినవి. అందుకే పంచాంక యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల 2026లో మూడు రాశులవారికి పట్టిందల్లా బంగారం కాబోతోంది.

కన్యారాశి

ఈ రాశివారికి పంచాంక యోగం చాలా ఉపయోగకరంగా ఉండనుంది. పనిలో బాధ్యతలతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారుల నమ్మకాన్ని పొందుతారు. కెరీర్ మార్పు గురించి ఆలోచించే వారికి సానుకూల అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇంటి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.

ధనస్సు రాశి

నూతన సంవత్సరంలో ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శని, సూర్యుడి కలయిక క్రమశిక్షణగా ఉంచుతుంది. నిర్ణయాలను సరైన దిశలో తీసుకునేలా పంచాంక యోగం ఉపయోగపడుతుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. కుటుంబంలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. పనిలో పదోన్నతి, కొత్త బాధ్యతలు లభిస్తాయి.

మీనరాశి

ఈ పంచాంక యోగం మీనరాశివారి జీవితాల్లో స్థిరత్వం, ప్రయోజనాలను తీసుకొస్తుంది. కృషికి తగిన ఫలిం వస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

గమనిక : "దిశ" ఇలాంటి మత విశ్వాసాలను ప్రోత్సహించదు. ఇక్కడ తెలిపిన అంశాలు ఇంటర్నెట్ లో సేకరించిన వాటి ఆధారంగా మాత్రమే ఇవ్వబడినవి.

Next Story