- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026లో పంచగ్రహ రాజయోగం.. ఏడు రాశుల వారిని వరించనున్న అదృష్టం
2026 నూతన సంవత్సరం ప్రారంభంలోనే అనేక యోగాలు, సంయోగాలు ఏర్పడనున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: 2026 నూతన సంవత్సరం ప్రారంభంలోనే అనేక యోగాలు, సంయోగాలు ఏర్పడనున్నాయి. ఇవి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ప్రసాదించనున్నాయి. వాటిలో ఒకటి పంచగ్రహ రాజయోగం. జనవరి మధ్యలో ఏర్పడనున్న ఈ శుభ సంయోగం ఏడు రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. జనవరి 13 నుంచి 18 వరకూ 5 గ్రహాలు మకరరాశిలో ఉంటాయి. శుక్రుడు, సూర్యుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు మకరరాశిలో ఉండగా పంచగ్రహ రాజయోగం ఏర్పడుతుంది.
వృషభ రాశి
పంచగ్రహ రాజయోగం వృషభరాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. కెరీర్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు పొందే ఛాన్స్ ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి
ఈ రాశివారికి నూతన సవత్సరంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు. ఆగిపోయిన నిధులు వచ్చే ఛాన్స్ ఉంది. కమ్యూనికేషన్ ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్కాటక రాశి
వీరికి కొత్త సంవత్సరంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం వరిస్తుంది. నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడుతాయి. ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.
సింహరాశి
పంచగ్రహ రాజయోగం ఈ రాశివారికి గత ఉద్రిక్తతలను తగ్గిస్తుంది. కెరీర్లో స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. పెట్టుబడులు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
తులారాశి
మీ కష్టానికి కొత్త సంవత్సరంలో ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక స్పష్టత ఉంటుంది.
ధనస్సు రాశి
వీరికి కొత్త సంవత్సరంలో పంచగ్రహ రాజయోగం శుభాలను తీసుకొస్తుంది. విద్య,వ్యాపారాల్లో విజయం వరిస్తుంది. కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి
పంచగ్రహ రాజయోగం ఈ రాశివారి జీవితంలో మార్పు, పురోగతిని సూచిస్తుంది. ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి లభిస్తుంది. ఆర్థిక విషయాలు క్రమంగా మెరుగుపడతాయి.






