- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెరుచుకున్న నాగచంద్రేశ్వర ఆలయం.. పోటెత్తిన భక్తులు
మన దేశంలో ఎన్నో చారిత్రకత్మక పురాతన ఆలయాలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో ఎన్నో చారిత్రకత్మక పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాల్లో అయితే నేటీకి అంతుచిక్కని ఎన్నో రహస్యలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం. ఈ ఆలయంలోని మహాకాళేశ్వరస్వామి ద్వాదశ జ్యోత్లిరింగాల్లో ఒకటి కాగా, ఇక్కడి మహాంకాళి అమ్మవారు అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పూజలందుకుంటున్నారు. ఇక ఈ ఆలయంలో మరో అరుదైన ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఈ ఆలయంలోని మహాకాళేశ్వర ఆలయంపై నాగచంద్రేశ్వరుడి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. అది కూడా నాగపంచమి రోజు మాత్రమే నాగచంద్రేశ్వరుడి భాగ్యం భక్తులకు కలుగుతుంది. నాగపంచమి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి నిర్వహిస్తారు. ఆ తర్వాత, ఆలయ తలుపులు మళ్ళీ మూసివేసి తిరిగి సంవత్సరం తర్వాత తెరుస్తారు.
హిందువులు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది జులై 29 తేదీ (మంగళవారం) నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. పవిత్రమైన పండగ సందర్భంగా సంవత్సరం పొడవునా మూసి ఉండే నాగచంద్రేశ్వర ఆలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచారు. దీంతో దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఉజ్జయినికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగిపోతూ, భక్తుల ఆధ్యాత్మిక తపనలకు నిలయంగా మారింది. అధికారులు భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలు తీసుకుని, క్యూ లైన్లు, వైద్య సదుపాయాలు, త్రాగునీటి పంపిణీ వంటి విభాగాల్లో సిబ్బందిని కేటాయించారు. ఏడాది మొత్తంలో ఈ ఒక్కరోజే లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
ఏడాదికి ఒకసారి మాత్రమే ఎందుకు?
పురాణాల ప్రకారం ఒకప్పుడు సర్ప రాజు తక్షకుడు శివుని అనుగ్రహం పొందడానికి ఘోరమైన తపస్సు చేసాడు. శివుడు తక్షకుని తపస్సుకు సంతోషించి అతనికి అమరత్వం ప్రసాదించాడు. ఆనాటి నుంచి తక్షకుడు సర్పం రూపంలో పరమ శివుడు సంచరించే మహాకాళ అడవిలో నివసించడం ప్రారంభించాడు. అయితే తక్షకుడు తన ఏకాంతానికి ఎవరూ భంగం కలిగించకూడదని శివుని కోరుకున్నాడు. ఈ కారణంగానే నాగచంద్రేశ్వర ఆలయం తలుపులు ఏడాదిలో ఒకసారి నాగ పంచమి రోజున మాత్రమే తెరుస్తారు.






