- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mercury Transit : మీన రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు!
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి. త్వరలో బుధుడు ( budhudu) గురు గ్రహానికి సొంత రాశిగా చెప్పుకునే మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే, ఈ గ్రహం పది నెలల తర్వాత మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. ఇప్పటికే అదే రాశిలో శుక్రుడు కూడా ఉన్నాడు. దీని వలన శక్తివంతమైన లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ యోగ ప్రభావం మొత్తం 12 రాశుల మీద పడుతుంది. దీని వలన కొన్ని రాశుల వారి జీవితంలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా, మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మకర రాశి ( Makara rasi )
లక్ష్మీ నారాయణ రాజయోగం మకర రాశి వారికి కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. అలాగే, మీరు పని చేస్తున్న ఆఫీసులో ప్రమోషన్ తో పాటు వేతనం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, కొత్తగా వ్యాపారాలు చేస్తున్న వారికీ లాభాలు వస్తాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అంతేకాకుండా, కోర్టుకి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.
మీన రాశి ( Meena rasi )
లక్ష్మీ నారాయణ రాజయోగం ఎఫెక్ట్‌తో కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీన రాశిలో బుధ సంచారం చేయడం వలన ఈ రాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టె వారికీ మంచి సమయం. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టేవారికి అధిక డబ్బు లభిస్తుంది. దీని వలన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






