TTD: శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం.. ఎప్పుడంటే?

by Ramesh Naini |

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తికా దీపోత్సవం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

TTD: శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం.. ఎప్పుడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 3న సాయంత్రం భక్తిపూర్వకంగా కృత్తికా దీపోత్సవం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అధికారుల వివరాల ప్రకారం.. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముందుగా గర్భాలయంలో స్వామివారికి దీపారాధన చేసి, అనంతరం ఆలయ శిఖరంపై దీపారాధన నిర్వహించబడుతుంది.

తదుపరి రాత్రి 7.30 గంటలకు పుష్కరిణి వద్ద జ్వాలాతోరణం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రతి ఏడాది కృత్తిక నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ వేడుకను పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించేందుకు వస్తారని అధికారులు తెలిపారు. కార్యక్రమాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సరైన ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ పేర్కొంది.

Next Story