Shivaratri Special: ఉపవాసం మంచిదే.. కానీ అందరికీ కాదు!

by Gantepaka Srikanth |

శివరాత్రి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉపవాసాలు, జాగారాలు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉపవాసాలు చేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం ఆరు, ఏడు గంటల వరకు ఆహారం, పానీయాలను తీసుకోకుండా ఉంటారు.

Shivaratri Special: ఉపవాసం మంచిదే.. కానీ అందరికీ కాదు!
X

దిశ, వెబ్‌డెస్క్: శివరాత్రి(Maha Shivaratri 2026) పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉపవాసాలు, జాగారాలు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉపవాసాలు చేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం ఆరు, ఏడు గంటల వరకు ఆహారం, పానీయాలను తీసుకోకుండా ఉంటారు. అయితే.. ఉపవాసం ఆరోగ్యానికి చాలా మంచిది అంటూనే.. అందరికీ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపవాసం చేయడం వల్ల ఊబకాయంతో బాధపడేవారికి ప్రయోజనం చేకూరుతుందంటున్నారు నిపుణులు. అయితే కేవలం నీళ్లను మాత్రమే తీసుకునేటప్పుడు కాస్త గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిదని.. ఇలా తీసుకునే నీటిలో కాస్త నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు. నిమ్మరసం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడంతోపాటు.. శరీరం నీరసించకుండా తక్షణ శక్తి లభిస్తుంది.

అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది అంటున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించడంతో పాటు.. శరీరంలోని వ్యర్థాలూ బయటికి వెళ్లిపోతాయట. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే ఉపవాసం చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో మందులు వాడేవారు ఉపవాసం ఉండటం ప్రమాదకరమని అంటున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలు, పండ్లు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శివారాధన చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story