- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో జెర్రి కనిపిస్తే నష్టం కంటే..లాభాలే ఎక్కువనా !
ఇల్లు దేవాలయం లాంటిది. ఇంట్లో ఉన్న సుఖం... కాశీకి వెళ్లిన దొరకదని పెద్దలంటూ ఉంటారు. అయితే అలాంటి మన ఇంటిని

దిశ, వెబ్ డెస్క్ : ఇల్లు దేవాలయం లాంటిది. ఇంట్లో ఉన్న సుఖం... కాశీకి వెళ్లిన దొరకదని పెద్దలంటూ ఉంటారు. అయితే అలాంటి మన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత శుభ్రంగా ఉంచుకున్న ఇంట్లో ఏదో ఒక కీటకం, లేదా పురుగులు తరచూ కనిపిస్తూ ఉంటాయి. వానపాములు, జెర్రీ ఇలా చాలా రకాల కీటకాలు కూడా వస్తూ ఉంటాయి.
అయితే ఇంట్లో జెర్రీ ( Centipedes) కనిపిస్తే.. ఆశుభమే అని అంటున్నారు పండితులు. జెర్రీ కనిపించిందంటే... ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లని చెబుతున్నారు. పరోక్షంగా వాస్తు దోషం ఉన్నట్లు ఆ జెర్రీలు కనిపించి.. సంకేతాలు ఇస్తాయట. అంతేకాదు అలా వంటగదిలో జెర్రీ కనిపిస్తే.. ఇంట్లో ముఖ్యమైన వ్యక్తికి అనారోగ్యం సంభవించే ప్రమాదం కూడా ఉంటుందట.
అయితే ఈ జెర్రీ పూజ గదిలో కనిపిస్తే... ధన లాభం కలుగుతుందని అంటున్నారు. ఇంట్లో లక్ష్మీ దేవత కురుస్తుందట. అంటే ఇంట్లో జెర్రీ ఉంటే నష్టంతో పాటు లాభాలు కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ జెర్రీలు... చాలా విషపూరితం. వాటిని అసలు లైట్ తీసుకోకూడదు. కనిపిస్తే చంపేయడం లేదా బయట పారేయడం ఇలాంటివి చేయాలని అంటున్నారు.






