శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-10 04:46:21  IST  )

ఇవాళ స్వామివారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తుల వేచి ఉన్నారు.

శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి (Tirupathi) శ్రీవారి కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు, వారంతం కావటంతో కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ స్వామివారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తుల వేచి ఉన్నారు. అలాగే శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కాగా శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 84,404 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,930 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story