తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

by Yella Dhawani Reddy |

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి కొండపై భక్తుల రద్దీ నెలకొంది.

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి కొండపై భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారికి ఎంతో ఇష్టమైన శ్రావణమాసం కావటంతో ఆ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో బుధవారం స్వామివారం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే, వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. ఇక మంగళవారం శ్రీవారిని 75,183 మంది భక్తులు దర్శించుకోగా, 25,906 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.89 కోట్లు సమకూరినట్లు టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story