తిరుమలలో ఏమాత్రం తగ్గని రద్దీ.. దర్శనానికి నిరీక్షణ తప్పదు!

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు పూర్తయినా.. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.

తిరుమలలో ఏమాత్రం తగ్గని రద్దీ.. దర్శనానికి నిరీక్షణ తప్పదు!
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు పూర్తయినా.. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సులో స్వామివారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 30 కంపార్టుమెంట్లు ఫుల్లయ్యాయి. ఉదయం 8 గంటల తర్వాత ఎలాంటి టోకెన్ లేకుండా క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. రూ.300 శీఘ్రదర్శనం టోకెన్ ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని తెలిపారు. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందన్నారు.

నిన్న (సోమవారం) స్వామివారిని 91,478 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,376 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.5.04 కోట్లు సమకూరింది. 4.15 లక్షల లడ్డూలను విక్రయించగా.. 2.60 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.

Next Story