- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శిలాతోరణం వరకూ క్యూలైన్
వేసవి సెలవులు త్వరలో ముగియనున్నాయి. జూన్ 12 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ఉండగా.. మరో 23 రోజుల్లో సెలవులు పూర్తవుతాయి. ఈ క్రమంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: వేసవి సెలవులు త్వరలో ముగియనున్నాయి. జూన్ 12 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ఉండగా.. మరో 23 రోజుల్లో సెలవులు పూర్తవుతాయి. ఈ క్రమంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. కుటుంబాల సమేతంగా శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయం వరకూ.. కంపార్టు్మెంట్లన్నీ భక్తులతో నిండిపోగా.. శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. 8 గంటల తర్వాత టోకెన్లు లేకుండా ఉచిత దర్శనం క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం అయ్యేందుకు 4-6 గంటలు, రూ.300 శీఘ్రదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3-4 గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న (సోమవారం) స్వామివారిని 80,455 మంది భక్తులు దర్శించుకోగా.. 43,309 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.41 కోట్లు సమకూరింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత నేపథ్యంలో భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ కోరుతోంది. అన్నపానీయాలు, పాలు, మజ్జిగ పంపిణీలో ఎలాంటి లోటు లేకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.






