- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలం వెళ్లేవారికి గుడ్ న్యూస్.. జులై 1 నుంచి ఉచిత స్పర్శ దర్శనం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త!

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం (Srisailam) వెళ్లే భక్తులకు (Devotees) శుభవార్త! జులై 1వ తేదీ నుంచి శ్రీ మల్లికార్జునస్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని పున:ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సౌకర్యాన్ని వారానికి నాలుగు రోజులు అంటే.. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పిస్తామన్నారు. అయితే, భక్తులు ఏ రోజుకారోజు ఉచిత స్పర్శదర్శనం టోకన్లు పొందాల్సి ఉంటుందన్నారు. దీని కోసం దేవస్థానం కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానాన్ని అమలు చేయనుందని తెలిపారు.
అయితే, ప్రస్తుతానికి దేవస్థానం వద్ద టోకెన్లు జారీ చేస్తామని, తర్వాత ఆన్‌లైన్‌లో నమోదుచేసుకునే విధానం ప్రవేశపెడతామని తెలిపారు. టోకెన్లలో భక్తుల పేరు, ఆధార్, ఫోన్ నంబర్, క్యూఆర్ కోడ్ ఉంటాయని చెప్పారు. అవకాశాన్ని బట్టి రోజూ 1,000 నుంచి 1,200 మందికి ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని భావిస్తున్నామన్నారు. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తీక మాసాల్లో ఈ దర్శనం మాత్రం ఉండదు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా స్పర్శ దర్శనం ఉండదని ఆలయ ఈవో తెలిపారు.






