ఇక్కడ గంజాయి నిషేధం.. కానీ ఆ ఆలయంలో ప్రసాదం..

by Disha Web Desk 20 |
ఇక్కడ గంజాయి నిషేధం.. కానీ ఆ ఆలయంలో ప్రసాదం..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా లడ్డూ, చక్కెర పొంగలి, పులిహోర, సిరా వంటి పదార్థాలను ఇస్తుంటారు. అలాగే తీర్థంగా తులసి, కొబ్బరి నీళ్లను ఇస్తుంటారు. అయితే కొన్ని ఆలయాల్లో వీటికి భిన్నమైన తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలాంటి ఆలయమే కర్నాటకలో కూడా ఉంది. అయితే భారతదేశం అంతటా గంజాయి అమ్మడం, గంజాయి తినడం నేరంగా పరిగణిస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఏకంగా గంజాయిని ప్రసాదంగా ఇస్తున్నారట. దీన్ని ప్రసాదంగా ఇవ్వడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని, భగవంతుడికి దగ్గరగా ఉన్నట్లు భావిస్తారని అక్కడి వారు చెబుతుంటారు. ప్రజలు ఈ ప్రసాదాన్ని తీసుకోవడం భగవంతుని పై ఉన్న విశ్వాసానికి ఒక రూపం. ఇంత వింత ఆచారం ఉన్న ఉత్తర కర్ణాటకలో ఉన్న శ్రీ మౌనేశ్వర్ ఆలయం గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.

ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం..

ఉత్తర కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని మౌనేశ్వర్ ఆలయంలో గంజాయిని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అవధూత్, శర్నా, శపత్ వంటి స్థానిక వర్గాల ప్రజలు దీనిని దేవుని ప్రసాదంగా భావించి వివిధ రూపాల్లో సేవిస్తారు. గంజాయిని ప్రసాదంగా పంచిపెట్టే సంప్రదాయం చాలా ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతోందని.

గంజాయి ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది..

శివునికి అంకితం చేసిన మౌనేశ్వర్ ఆలయం గురించి చెప్పాలంటే ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా ఒక విభిన్నమైన అనుభూతిని పొందుతారని, మనస్సులో శాంతిని పొందుతారు. ఏ భక్తుడైనా ఇక్కడ హృదయపూర్వకంగా మౌనేశ్వరున్ని పూజిస్తే వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ప్రసాదంలో కలిపిన గంజాయిని సేవించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని, జీవితంలో దిశానిర్దేశం ఉంటుందని భక్తులు నమ్ముతారు. శ్రావనమాసం, మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీగా జనసందోహం కనిపిస్తుంది.

వార్షిక జాతర..

జనవరిలో మౌనేశ్వర్ ఆలయం సమీపంలో భారీ వార్షిక జాతర కూడా నిర్వహిస్తారు. మౌనేశ్వరుడు లేదా మానప్పను పూజించిన తర్వాత, భక్తులకు గంజాయి ప్యాకెట్లను ప్రసాదంగా అందజేస్తారు. భక్తులు దానిని భక్తితో సేవించి, అదృష్టంగా భావిస్తారు. మౌనేశ్వర్ ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే గంజాయి పవిత్రమైనదని భక్తులు చెబుతారు. ఈ గంజాయి ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్లడానికి సహాయపడుతుందని అక్కడి భక్తులు చెబుతుంటారు.

ధ్యానం కోసం..

గంజాయి ప్రసాదం కేవలం మౌనేశ్వర్ ఆలయంలోనే కాకుండా కర్ణాటకలోని అనేక దేవాలయాల్లో ఇస్తుంటారట. చాలా మంది ప్రజలు ధ్యానం, ఆధ్యాత్మిక చింతన కోసం గంజాయిని ఉపయోగిస్తారట. ఈ పవిత్రమైన గడ్డిని రోజుకు లేదా వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగిస్తారట. ఈ సంప్రదాయం వింతగా అనిపించవచ్చు కానీ భిన్నత్వంతో నిండిన ఈ దేశంలో ప్రతి విశ్వాసానికి గౌరవం ఉంది.

Next Story

Most Viewed