- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంత చతుర్దశి నాడే వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి? దీని వెనుకున్న పురాణగాథ ఏంటి?
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆగస్టు 27న గణపయ్యను ఆహ్వానించిన భక్తులు.. తమకు నచ్చినట్లుగా, దేవుడు మెచ్చేట్లుగా నైవేద్యాలు సమర్పించి ప్రసన్నం చేసుకుంటున్నారు. దాదాపు వినాయకుడికి గుడ్ బై

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆగస్టు 27న గణపయ్యను ఆహ్వానించిన భక్తులు.. తమకు నచ్చినట్లుగా, దేవుడు మెచ్చేట్లుగా నైవేద్యాలు సమర్పించి ప్రసన్నం చేసుకుంటున్నారు. దాదాపు వినాయకుడికి గుడ్ బై చెప్పేసేందుకు దగ్గరయ్యారు. ఈ సమయంలో చాలా మందిలో గణనాథుడిని అనంత చతుర్దశి నాడే ఎందుకు నిమజ్జనం చేయాలనే ప్రశ్న మెదులుతుంది. ఈ క్రమంలో దీని వెనుకున్న పురాణగాథ గురించి వివరిస్తున్నారు నిపుణులు.
పురాణగాథ
వినాయకుడు విశ్రాంతి లేకుండా వరుసగా పది రోజులు మహాభారతాన్ని రచిస్తాడు. దీని కారణంగా ఆయన శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. కాగా ఈ ఉష్ణోగ్రతను తగ్గించేందుకు వేద వ్యాసుడు నీటిలో స్నానం చేయమని కోరుతాడు. అది అనంత చతుర్దశి రోజున జరిగింది. అందుకే ఈ పర్వదినాన గణేషుడిని చల్లబరిచేందుకు నిమజ్జనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. పది రోజులు భక్తుల సేవలందుకుని.. 11వరోజున గంగమ్మ ఒడికి చేరుతాడు.






