- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదివారం మౌని అమావాస్య.. ఆ సమయంలో ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
నూతన ఏడాదిలో మొదటి అమావాస్య ఇది.

దిశ,వెబ్‌డెస్క్: నూతన ఏడాదిలో మొదటి అమావాస్య ఇది. సాధారణంగా పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు. దీనికి చాలా విశిష్టత ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే.. చాలా మంది మౌని అమావాస్య(Mauni Amavasya) పవర్ ఫుల్ అని చెబుతుండటం వినే ఉంటారు. ఇక, ఆదివారం అమావాస్య మరింత పవర్ ఫుల్ అని మరికొందరు అంటుంటారు. ఈ ఏడాది మౌని అమావాస్య ఈ నెల(జనవరి) 18వ తేదీన ఆదివారం వచ్చింది.
ఆదివారం మౌని అమావాస్య వచ్చింది కాబట్టి కొన్ని నియమాలు పాటించడం వల్ల మంచి జరుగుతుందని పురోహితులు చెబుతుంటారు. ఆదివారం తెల్లవారుజామున స్నానం, వ్రతం, దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు. మౌని అమావాస్య రోజు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు స్నానం చేయడానికి పవిత్రమైన సమయమని అంటున్నారు. ఈ తరుణంలో ఆరోగ్యం, మానసిక శాంతి, ధనం లభిస్తాయని విశ్వసిస్తారు. అంతేకాదు ఆ రోజు మౌనవ్రతం చేయడం అత్యుత్తమ ఫలితాలు ఇస్తుందంట. ఎవరైతే శని, రాహు-కేతు దోషాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు మౌని అమావాస్య రోజు ధార్మిక కార్యాలు చేస్తే దోషాలు తొలగిపోవడంతో పాటు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు మూగజీవాలకు ఆహారం పెట్టండి. రాగి పాత్రలో నీరు పోసి వాటిలో ఎర్రటి పువ్వులను కలిపి ఆ నీటితో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. త్రిమూర్తి స్వరూపంగా భావించే రావిచెట్టుకు మౌని అమావాస్య రోజు పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయంట. అలాగే, చెట్టు చుట్టూ 108 సార్లు దారాలు చుట్టి పూజ చేయాలి. అనంతరం దీపం వెలిగించి నమస్కరించడం ఉత్తమం. మరీ మౌని అమావాస్య ఆదివారం ఏ సమయం నుంచి స్టార్ట్ అవుతందంటే.. పంచాంగం ప్రకారం.. మౌని అమావాస్య జనవరి 17(శనివారం) అర్ధరాత్రి 12 దాటినప్పటి నుంచి ప్రారంభమై జనవరి 18(ఆదివారం) అర్ధరాత్రి ఒంటిగంట 24 నిమిషాల వరకు ఉంటుంది.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






