Bhogi Pallu: భోగి పళ్ళు పిల్లల తలపై పోయడానికి కారణమేంటో తెలుసా.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే?

by Phanindra |

పిల్లల తలపై భోగి పళ్ళు ( bhogi pallu ) పొసే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది.

Bhogi Pallu: భోగి పళ్ళు పిల్లల తలపై పోయడానికి కారణమేంటో తెలుసా..  పురాణాలు ఏం చెబుతున్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. పల్లె టూర్లలో గాలిపటాలు ఎగురవేస్తూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ప్రతీ ఇంట్లో ధాన్యరాశులతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. బోగి పండగ రోజున పిల్లల తలపై భోగి పళ్ళు ( bhogi pallu ) పొసే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అసలు, ఆ రోజు పిల్లల తలపై భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

అయితే, భోగి రోజు పిల్లల తల మీద పోయడం వలన నర దిష్టి పోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా, దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉందని చెబుతున్నారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట. ఆ పండ్లను తలపై పోసినప్పుడు పిల్లల జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు. ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా ఉంటాయని భోగి పళ్ళను పోస్తారు.

పురాణాల ప్రకారం, నారాయణుడు ( Narayana god ) భోళా శంకరుడిని ( Lord Shiva ) ప్రసన్నం చేసుకోవడానికి తప్పస్సు చేశారట. అయితే, అప్పుడు దేవతలందరూ వచ్చి అతని తలపై ఫలాలను కురిపించారట. దానికి ప్రతీకగా చిన్న పిల్లలను నారాయణుడిగా భావించి.. అప్పటి నుంచి వారి తలలపై భోగి పళ్ళు పోసే సంప్రదాయం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story