- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Holi colours: హోలీ రోజు చల్లే రంగుల వెనుక అర్థం ఏంటో తెలుసా?
'కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు.. రంగు లోనే లైఫ్ ఉంది రా..' అక్కినేని నాగార్జున నటించిన ఓ తెలుగు సినిమాలోని పాట

దిశ, వెబ్ డెస్క్: 'కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు.. రంగు లోనే లైఫ్ ఉంది రా..' అక్కినేని నాగార్జున నటించిన ఓ తెలుగు సినిమాలోని పాట. ఈ ఏడాది మార్చి 14న (శుక్రవారం) హోలీ పండుగ వచ్చింది. ఇక చిన్నా, పెద్దా వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకను జరుపుకుంటారు. ఈ సందర్భంగా హోలీలో ఉపయోగించే రంగుల వెనుక ఉన్న అంతర్యం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆకుపచ్చ (Green): ఈ రంగు హోలీ వేడుకల్లో ముఖ్యమైన రంగుగా భావిస్తారు. ఇది మనశ్శాంతి, అభివృద్ధిని సూచిస్తుంది. కొత్త బంధాలను ప్రారంభించాలనుకునే వారు, గతంలో మనస్పర్థలు వచ్చిన వ్యక్తిని మళ్లీ కలిసేందుకు ఈ ఆకుపచ్చ రంగులు చల్లుకుంటారు.
ఎరుపు (Red): హిందూ సంప్రదాయంలో ఎరుపు రంగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎరుపు రంగుకు అతీతమైన శక్తి ఉందని నమ్ముతారు. ఇక హోలీ వేడుకలో ఎరుపు రంగును ప్రేమ, వివాహానికి ప్రతీకగా వాడుతారు. ప్రియురాలు భాగస్వామితో చేసుకునే హోలీలో దీన్ని ఉపయోగిస్తారు.
గులాబీ (Pink): హోలీ వేడుకల్లో మనకు ఎక్కువగా కనిపించే రంగు గులాబీ. అందం, ఆప్యాయత, నమ్మకాన్ని తెలిపేందుకు ఈ రంగను వినియోగిస్తుంటారు. స్నేహితులు, బంధువులతో ఉన్న బంధాన్ని కొనసాగించేందుకు వారిపై ఈ రంగు చల్లుతారు.
పసుపు (Yellow): ఎరుపు తర్వాత హిందువులు పసుపు రంగుకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా దీనిని భావిస్తారు. ప్రియమైన వారు ప్రశాంతంగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పసుపు రంగును చల్లుతారు. ఆత్మవిశ్వాసం పెరిగేందుకు ఈ రంగు ఉపయోగిస్తారు.
నీలం (Blue): ఈ రంగును శ్రీకృష్ణుడికి ప్రతీకగా భావిస్తారు. ఆత్మపరిశీలన, ప్రశాంతత, బలమైన మనోస్థైర్యాన్ని సూచించే ఈ రంగును స్నేహితులపై చల్లుతారు.
ఆరెంజ్ (Orange): ఈ రంగులో సూర్యదేవుడి శక్తి ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఏదైనా పనిని ప్రారంభించేందుకు, క్షమాగుణానికి ప్రతీకగా నారింజ రంగును ఉపయోగిస్తారు.
అయితే, హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకోవటం ఆనవాయితీ. అయితే, సంబరం పేరుతో మనల్ని మనమే ఇబ్బందుల్లోకి నెట్టుకోకూడదు. మార్కెట్‌లో దొరుకుతున్న రంగులను కెమికల్స్‌తో తయారు చేస్తారు. వీటి వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకే వీలైనంతా వరకు రంగులను ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసుకుని వాటితో హోలీ ఆడుకోవటం మంచిది.






