Laat maar holi: 'లాఠ్ మార్ హోలీ' గురించి తెలుసా? రంగు పూయటమే కాదు.. కర్రలతో కొడుతారు!

by Yella Dhawani Reddy |

హోలీ పండుగ వచ్చేసింది.

Laat maar holi: లాఠ్ మార్ హోలీ గురించి తెలుసా? రంగు పూయటమే కాదు.. కర్రలతో కొడుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: హోలీ పండుగ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే, ప్రాంతాన్ని బ‌ట్టి వేడుక‌ల తీరు, సంప్ర‌దాయం మారుతూ వ‌స్తుంది. అలాగే, హోలీని ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. ఇందులో భాగంగానే యూపీలోని (UP) పలు ప్రాంతాల్లో హోలీ (Holi) వేడుకలను 'లాఠ్ మార్'గా (Laat maar Holi) పిలుస్తారు. అంతేకాదు, ఈ వేడుకలో అమ్మాయిలు అబ్బాయిల వెంట పడుతూ కర్రలతో కొడుతుంటారు. ద్వాపర యుగం నుంచి కొనసాగుతూ వస్తోన్న ఈ వింత ఆచారం ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యూపీలోని బర్సానా, నంద్‌గావ్‌ (Barsana, Nandgaon) ప్రాంతాల్లోని ప్రజలు ప్రాచీన కాలం నుంచి 'లాఠ్ మార్' హోలీని నిర్వహిస్తున్నారు. లాఠ్ మార్ అంటే కర్రలతో కొట్టడం అని అర్థం. ఇక ప్రజలంతా ఒక్కచోట చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. అనంతరం కర్రలతో కొడుతుంటారు. పురాణాల ప్రకారం.. ద్వాపర యుగంలో రాధా కృష్ణుల ప్రేమకు గుర్తుకుగా ఈ వేడుక జరుపుకుంటామని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. బర్సానా అనే గ్రామంలో నివసించే రాధను, ఆమె స్నేహితురాళ్లను.. నంద్‌గావ్‌ వాసి అయిన శ్రీకృష్ణుడు తన చిలిపి చేష్టలతో ఏడిపించే వాడు. దీంతో గోపికలు తిరిగి కర్రలతో సరదాగా కృష్ణుడిని దండించేవారు. ఈ క్రమంలోనే 'లాఠ్‌మార్‌ హోలీ'కి అంకురార్పణ జరిగినట్లు స్థానికులు చెబుతారు. అప్పట్నుంచి ఏటా ఈ రెండు ప్రాంతాల్లో లాఠ్‌మార్‌ హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ రెండు గ్రామాల ప్రజలంతా ఒక్కచోట చేరి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. అనంతరం నంద్‌గావ్‌కు చెందిన పురుషులను బర్సానాకు చెందిన మహిళలు కర్రలతో కొడుతుంటారు. వారు ఈ దెబ్బల్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం.. చూసేవారికి నవ్వు తెప్పిస్తుంది.

Next Story