శ్రీవారి దర్శనం కోసం 14 గంటలుగా వేచి ఉన్న భక్తులు

by Bhoopathi Nagaiah |   (  Updated:2024-02-20 07:34:25  IST  )

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది.

శ్రీవారి దర్శనం కోసం 14 గంటలుగా వేచి ఉన్న భక్తులు
X

దిశ, తిరుమల : తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. మంగళవారం ఉదయం వరకు 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా టోకెన్లు తీసుకున్న వారిని మినహాయిస్తే సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దాదాపు 14 గంటల పాటు సమయం పడుతోంది. ఇదిలా ఉండగా సోమవారం ఒక్కరోజే 64,741 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 24,667 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న భక్తులు కానుకలను హుండీలో సమర్పించడం వలన రూ.3.82 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

Next Story