- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారి దర్శనానికి పొటెత్తిన భక్తులు
by Yella Dhawani Reddy |
తిరుమల శ్రీవారి (Tirumala Srivaru) దర్శనానికి భక్తులు పోటెత్తారు.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి (Tirumala Srivaru) దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, వారంతం సెలవులు కావటంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. ఇక శనివారం అర్థరాత్రి వరకు ఏడుకొండలవాడిని 95,080 మంది భక్తులు దర్శించుకోగా, 39,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Next Story






