- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala update : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 8 గంటలు
ఓ వైపు వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలు, మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా తిరుమలకు (Tirumala Samacharam) వచ్చే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలు, మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా తిరుమలకు (Tirumala Samacharam) వచ్చే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మంగళవారం స్వామివారి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి శ్రీవారి దర్శనంకు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) తెలిపింది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 2-4 గంటల సమయం పడుతుందని, రూ.300 శ్రీఘ్రదర్శనంకు 1-3 గంటల సమయం పడుతుందని పేర్కొంది.
-సోమవారం (సెప్టెంబర్ 1) స్వామివారిని 65,384 మంది భక్తులు దర్శించుకోగా.. 22,512 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Next Story






