- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
by Naga Rani Yarlagadda |
సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ తిరుమలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదికొకసారి వచ్చే పెద్ద పండుగకోసం అందరూ సొంతూళ్లకు వెళ్లడంతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ తిరుమలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదికొకసారి వచ్చే పెద్ద పండుగకోసం అందరూ సొంతూళ్లకు వెళ్లడంతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని పేర్కొంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (సోమవారం) స్వామివారిని 68,542 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,372 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు సమకూరింది.
Next Story






