- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: తిరుమలలో భక్తు రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం స్వామివారిని దర్శించుకునేందుకు టోకెన్లు లేని భక్తులకు (Devotees) సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని 70,970 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 33,871 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.2.56 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.
కాగా, ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ ద్వారా పొందిన భక్తులు ఈరోజు నుంచి 22వ తేదీ వరకు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి. అర్జిత సేవా టికెట్ల నమోదుకు మే 19 ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది. మే 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల ఆగస్టు నెల కోటాను విడుదల చేస్తారు.






