తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. సర్వ దర్శనానికి పట్టే సమయం ఎంతంటే..?

by Chukka Sudharani |

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. సర్వ దర్శనానికి పట్టే సమయం ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 10 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు కల్పించే సర్వదర్శనానికి 18 గంటలు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న శ్రీవారిని 60,699 మంది దర్శించుకోగా.. 23,096 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4 కోట్ల వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Next Story