- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 4 గంటల సమయం పడుతుండగా.. 300 రూపాయల టికెట్ ప్రత్యేక దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కాగా, గురువారం స్వామి వారిని 58,908 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3. 23 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది. అయితే, బుధవారం వరకు భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికి శని, ఆదివారాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారితో పాటు ఏ రోజు కా రోజు ఎస్ఎస్డీ టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని తెలిపారు.






