- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైకుంఠ ద్వార దర్శనాలపై కీలక అప్‌డేట్.. నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshan)పై తిరుమల తిరుపతి దేవస్థానం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshan)పై తిరుమల తిరుపతి దేవస్థానం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు శ్రీవారి దర్శనానికి టోకెన్లకు గాను ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లుగా టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) వెల్లడించారు. మూడు రోజుల దర్శన టోకెన్ల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 1 వరకు టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వం వాట్సాప్ సర్వీసెస్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిసెంబర్ 2న ఈ-డిప్ (E-Dip) ద్వారా ఎంపికైన భక్తుల ఫోన్లకు టోకెన్ వివరాలు మెసేజ్ ద్వారా అందతాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
సామాన్య భక్తులకే ఫస్ట్ ప్రియారిటీ.. బీఆర్ నాయుడు
డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని.. సాధారణ భక్తులకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. 10 రోజులకు గాను మొత్తం 182 గంటలు అందుబాటులో ఉండగా 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించినట్లుగా పేర్కొన్నారు. రూ.300, శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తామని బీఆర్ నాయుడు వెల్లడించారు.






