తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. 31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు

by Kema Shiva Kumar |

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. 31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం హాలీడే కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 2 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం స్వామి వారిని 78,217 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,000 మంది తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.75 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.

Next Story