- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి నెల టీటీడీ దర్శనం సేవా టికెట్లు విడుదల
by Malleboina Mahesh |
తిరుమల శ్రీవారి దర్బార్‌లో పాల్గొనాలనుకునే భక్తులకు టీటీడీ కీలక సమాచారం విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి దర్బార్‌లో పాల్గొనాలనుకునే భక్తులకు టీటీడీ (TTD) కీలక సమాచారం విడుదల చేసింది. ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించిన దర్శన, సేవా టికెట్లను ఇవాళ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్ల విడుదల కానున్నాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. టికెట్లు స్వల్ప సమయంలోనే ఫుల్ అయ్యే అవకాశముండటంతో భక్తులు ముందుగానే టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ స్లాట్లను బుక్ చేసుకోవాలని సూచిస్తోంది.
Next Story






