- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయోధ్యలో అక్షయ తృతీయ వేడుకలు.. ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన
యూపీలోని (Uttarpradesh) ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో(Ayodhya) బుధవారం అక్షయ తృతీయ (Akshaya tritiya) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని (Uttarpradesh) ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో(Ayodhya) బుధవారం అక్షయ తృతీయ (Akshaya tritiya) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామమందిరంలో 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అధికారికంగా తెలిపారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైశాఖ శుక్ల ద్వితీయ ముహూర్తంలో (మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రతిష్టించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
కాగా, ఇటీవలె అయోధ్యలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేసేలా 80 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని సిద్ధం చేశారు. ఈ సొరంగం గుండా ఒకేసారి 1.5 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేయడానికి వీలు కలుగుతుంది. ఇక మరోవైపు రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఏడు మండపాల నిర్మాణం పూర్తి కానున్నట్లు చంపత్ రాయ్ చెప్పారు. రామ్ దర్బార్లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో శివాలయం, నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు వివరించారు. మొత్తం నిర్మాణ పనులను ఈ ఏడాది అక్టోబర్ లోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.






