- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల శ్రీవారి దర్శన అప్‌డేట్స్
తిరుమలలో సోమవారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకోవడంతో.. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్‌మెంట్ల నిండా వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం పూర్తి కావడానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం శ్రీవారిని 75,343 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,505 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.69 కోట్లుగా నమోదైంది. చలికాలం ప్రారంభమై ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోతున్నప్పటికి తిరుమలలో భక్తుల రద్ధీ మాత్రం తగ్గడం లేదు. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమై భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు. అలాగే క్యూలైన్లలో వేచి ఉండే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.






