తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. కంపార్టుమెంట్లు ఫుల్

by Naga Rani Yarlagadda |

వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు ఫుల్ అయ్యాయి.

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. కంపార్టుమెంట్లు ఫుల్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల వెళ్లే భక్తులు ఏయే రోజుల్లో రద్దీ తక్కువగా ఉంటుందో తెలుసుకుని వెళ్లడం మంచిది. ఎందుకంటే ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. వారాంతాల్లో అయితే భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. నిన్నటి వరకూ తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ నేడు స్వల్పంగా పెరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 13) ఉదయానికి శ్రీవారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు లేనివారికి స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. 8 గంటల తర్వాతి నుంచి క్యూలైన్లలోకి వెళ్లే భక్తులకు 12 గంటల సమయం పట్టవచ్చని పేర్కొంది.

సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 2-5 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న (గురువారం)61,632 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 24,435 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు హుండీలో ధన, వస్తు రూపేణ సమర్పించిన కానుకల ద్వారా ఆదాయం రూ.3.28 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Next Story