తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ

121

దిశ, వెబ్‌డెస్క్: నేడు కార్తీక మాసం చివరి రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీశైలం మల్లన్న స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం.. శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. శ్రీశైలం ఆలయ పుష్కరిణి వద్ద సాయంత్రం లక్ష దీపోత్సవం, హారతి ఇవ్వనున్నారు. ఇక వేములవాడ రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టనుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..