- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీవారికి స్వర్ణ శంఖు, చక్రాలు
by Mallepaka Hamsa |
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారికి విలువైన బంగారు శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చాడు ఓ భక్తుడు. స్వర్ణ శంఖు, చక్రాలు సుమారు రూ.2 కోట్లు విలువ చేస్తాయి. తమిళనాడు రాష్ట్రంలోని తేనెకు చెందిన భక్తుడు తంగొదొరై రూ.2 కోట్ల విలువైన బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందజేశారు. బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఈవోకు ఆభరణాలు అందజేశారు. మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించినట్లు తంగదొరై చెప్పుకొచ్చారు. కాగా, గతంలోనూ తంగదొరై తిరుమల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారికి విలువైన బంగారు శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చాడు ఓ భక్తుడు. స్వర్ణ శంఖు, చక్రాలు సుమారు రూ.2 కోట్లు విలువ చేస్తాయి. తమిళనాడు రాష్ట్రంలోని తేనెకు చెందిన భక్తుడు తంగొదొరై రూ.2 కోట్ల విలువైన బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందజేశారు. బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఈవోకు ఆభరణాలు అందజేశారు. మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించినట్లు తంగదొరై చెప్పుకొచ్చారు. కాగా, గతంలోనూ తంగదొరై తిరుమల శ్రీవారికి బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చారు.
Next Story






