- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్స్యకారుడు షాక్.. జగిత్యాలలో ‘దెయ్యపు’ చేపలు
<p>దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన గొల్లపల్లి రాజనర్సు అనే మత్స్యకారునికి అరుదైన చేప లభించింది. ఆత్మకూర్‌కు చెందిన రాజనర్సు స్థానిక చెరువులో చేపలు పడుతుండగా అతని వలకు ఓ వింత చేప చిక్కింది. అది చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు రాజనర్సు. తాను ఎన్నో ఏండ్లుగా చేపలు పడుతున్నానని.. ఇలాంటి చేపను తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా దీనిని డెవిల్ […]</p>

X
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన గొల్లపల్లి రాజనర్సు అనే మత్స్యకారునికి అరుదైన చేప లభించింది. ఆత్మకూర్‌కు చెందిన రాజనర్సు స్థానిక చెరువులో చేపలు పడుతుండగా అతని వలకు ఓ వింత చేప చిక్కింది. అది చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు రాజనర్సు. తాను ఎన్నో ఏండ్లుగా చేపలు పడుతున్నానని.. ఇలాంటి చేపను తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా దీనిని డెవిల్ (దెయ్యపు) చేప అంటారని, ఇది ఎక్కువగా సముద్రపు జలాల్లో జీవిస్తాయని వెల్లడించారు. తెలంగాణలోని వాగులు, చెరువుల్లో ఇవి దొరకడం చాలా అరుదని వివరించారు. ఎగువన కురిసిన వర్షాలకు కాలువల ద్వారా ఇవి కొట్టుకుని వచ్చి ఉండొచ్చని వారు స్పష్టం చేశారు. ఈ రకం చేపలు తినడానికి పనికి రావని సమాచారం.
Next Story






